నిఖిల్ అంటేనే ఇష్టం.. మణికంఠకి నేనున్నా!
on Oct 5, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో నిన్నటి ఎపిసోడ్ లో మణికంఠ అందరి జాతకాలు చెప్పాడు. అది కాస్త ఫన్నీగా అనిపించింది. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరికి ఇంటి నుండి ఫుడ్ వచ్చింది.
మొదటగా యష్మీని కన్ఫెషన్ రూమ్‌కి బిగ్‌బాస్ పిలిచాడు. హౌస్ ఎలా ఉందంటూ అడుగా.. ఇంటి ఫుడ్ మిస్ అవుతున్నా.. అది తప్ప వేరే ఏం లేదు బిగ్‌బాస్ అని యష్మీ అంది. ఇంట్లో మీకు నచ్చిన హౌస్ మెట్ ఎవరు అని బిగ్ బాస్ అడుగగా.. పృథ్వీ, నిఖిల్ అంటూ యష్మీ బదులిచ్చింది. లాస్ట్ 1 వీక్ నుంచి ఇద్దరూ క్లోజ్ అయ్యారు.. ఒకరి పేరే చెప్పాలంటే నిఖిల్ అని యష్మీ అంది. ఆయన నాలాగానే అప్పుడప్పుడూ లోగా ఫీలవుతారు. తర్వాత నవ్వుతూ మాట్లాడతారు. యష్మీ మీ ముందున్న క్లాత్ తీయండి అని బిగ్‌బాస్ చెప్పాడు. మీ ముందు ఉన్న డిషెస్‌లో నిఖిల్ వాళ్ల అమ్మ చేసిన వంట.. మణికంఠకి వాళ్ల వైఫ్ చేసిన ఇంటి వంట వచ్చాయ్ అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇది మణికంఠ టీవీలో చూస్తూ "ప్రియ ఇండియాలో ఉందా.." అంటూ షాకయ్యాడు. మీ అందరూ ఇంటికి దూరంగా ప్రియమైన వారి జ్ఞాపకాలతో ఇక్కడ ఉంటున్నారు.. అందుకే మీ కోసం ఇంటి నుంచి ఫుడ్ తెప్పించా.. మీరు ఆలోచించి ఎవరికి ఇంటి వంట చెందాలో ఒకరికి ఇవ్వండి అని బిగ్‌బాస్ చెప్పాడు.
దీంతో నాకు మణికంఠ కంటే ఎక్కువ నిఖిల్ ఇంట్లో వాళ్లని మిస్ అవుతున్నాడనిపించింది.. కనుక నిఖిల్‌కి ఇస్తా అంటూ యష్మీ చెప్పింది. దీంతో బిగ్‌బాస్ మరోసారి అడిగాడు. యష్మీ.. ఇంటి వంటలతో పాటు వారిద్దరికీ ఇంటి నుంచి ప్రియమైన వారి దగ్గరి నుంచి మెసేజ్ కూడా వచ్చింది.. అది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటూ బిగ్‌బాస్ అన్నాడు. అది నాకు కావాలి యష్మీ.. ప్లీజ్ అంటూ బయట నుండి మణికంఠ చూస్తూ టెన్షన్ పడ్డాడు. కానీ యష్మీ మాత్రం నేను వాడి (నిఖిల్) ఫ్రెండ్‌గా ఈ హెల్ప్ చేయాలి.. కనుక నిఖిల్‌కే ఇస్తానంటూ యష్మీ చెప్పింది. మరోవైపు మణికంఠ మాత్రం.. తనెందుకు ఇండియాకి వచ్చిందంటూ టెన్షన్ పడ్డాడు. మణికంఠ గురించి ఏమీ ఆలోచించాలని లేదా అని మరోసారి బిగ్‌బాస్ అడుగగా.. మణికంఠకి నేనున్నానంటూ యష్మీ చెప్పింది. నువ్వు ఉండటమేంది నీకు అర్థం కావడం లేదంటూ మణికంఠ జుట్టు పీక్కున్నాడు. మణికి ఇక్కడ హౌస్‌లో ప్రేమ దొరుకుతుంది.. ఎక్కడక్కడ లవ్ ఇవ్వాల్సి వస్తే మేమందరం ఇస్తున్నాం.. కనుక ఫుడ్ మాత్రం నిఖిల్‌కే ఇస్తానంటూ యష్మీ చెప్పింది. దీంతో పట్టికెళ్లి ఇవ్వండి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక తర్వాత ఫుడ్ తీసుకెళ్లి నిఖిల్ చేతిలో పెట్టి ఓ హగ్ ఇచ్చింది. ఆ తర్వాత మణికంఠ దగ్గరికెళ్లి నీకు నేనున్నా అంటూ చెప్పగానే నాకు కొంచెం స్పేస్ ఇవ్వు మాట్లాడాలనే మూడ్ లేదంటూ మణికంఠ అన్నాడు. దీంతో మరోసారి యష్మీ కన్నింగ్ భయటపడింది. మణికంఠ మరోసారి డిస్సాపాయింట్ అయ్యాడు.
Also Read